బుధవారం, 2 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 మార్చి 2025 (10:01 IST)

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

telangana police
తెలంగాణ రాష్ట్ర పోలీసులు బెట్టింగ్ యాప్స్‌పైనా, వాటికి ప్రచారం చేస్తున్న సిన ప్రముఖులపైనా ఉక్కపాదం మోపుతున్నారు. ఈ యాప్స్ వ్యవహారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీచేశారు. 
 
సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది. సిట్ బృందంలో ఐజీ రమేశ్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్‌లు ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఇప్పటికే పంజాగుట్టతో పాటు సైబరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే. ఈ కేసులను కూడా ప్రభుత్వం సిట్‌కు బదిలీ చేసింది. దీనిపై 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని సిట్‌కు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీచేశారు.
 
ఎన్.సి.ఆర్.టి.సిలో ఉద్యోగ అవకాశాలు - నెలకు వేతనం రూ.75 వేలు!! 
 
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ (ఎన్.సి.ఆర్.టి.సి)లో వివిధ పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. ఈ రిక్రూట్మెంట్‌లో మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్ ఇంజనీర్, ప్రోగ్రామింగ్ అసోసియేట్, అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
 
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 యేళ్ళ వయసు కలిగివుండాలి. సీబీటీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ పోస్టుకు రూ.22,800 నుంచి రూ.75,850, ఎలక్ట్రానిక్స్ జూనియర్ ఇంజనీర్ పోస్టుకు రూ.22,800 నుంచి రూ.75,850, మెకానికల్ జూనియర్ ఇంజనీర్ పోస్టుకు రూ.22,800 నుంచి రూ.75,850, సివిల్ జూనియర్ ఇంజనీర్ పోస్టుకు రూ.22,800 నుంచి 75,850, ప్రోగ్రామింగ్ అసోసియేట్‌కు రూ.22,800 నుంచి రూ.75,850, హెచ్ఆర్ అసిస్టెంట్‌కు రూ.20,500 నుంచి రూ.65,500, కార్పొరేట్ హాస్పిటాలిటీ అసిస్టెంట్ పోస్టుకు రూ.20,250 నుంచి రూ.65,500, ఎలక్ట్రికల్ జూనియర్ మెయింటెనర్ పోస్టుకు రూ.18,250 నుంచి రూ.59,200, మెకానికల్ జూనియర్ మెయింటెనర్ పోస్టుకు రూ.18,250 నుంచి రూ.59,200 జీతం వరకు చెల్లిస్తారు. 
 
ఉద్యోగంలో చేరిన తర్వాత రెండేళ్ల ప్రొబేషన్ వ్యవధిని పూర్తి చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికుల వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.