బుధవారం, 2 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 మార్చి 2025 (10:32 IST)

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

hcuniversity
హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీ రణరంగంగా మారింది. యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవి సోమవారం కూడా కొనసాగాయి. ఆదివారం రాత్రి 400 ఎకరాల భూముల వేలంలో భాగంగా చదను చేసేందుకు 20 జేసీబీలతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని సమాంతరంగా చేస్తుండటంపై విద్యార్థులు క్యాంపస్ ముందు నిరసనలతో హోరెత్తించారు. ప్రభుత్వ తీరుపట్ల విద్యార్థులు మండిపడ్డారు. 
 
క్యాంపస్‌లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చటి వాతావరణంలో ఉన్న క్యాంపస్‌లోని చెట్లను తొలగించి, క్యాంపస్ స్థలాన్ని అమ్మేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆందోళన చేపట్టారు. సెలవు రోజులను చూసుకుని జేసీబీల సాహంయో స్థలాన్ని శుభ్రం చేసుతుండంపై వారు మండిపడుతూ, ఆందోళనలకు దిగారు. 
 
ఎట్టిపరిస్థితుల్లోనూ క్యాంపస్ స్థలాన్ని కోల్పోయేది లేదని, విద్యార్థులంతా కలిసికట్టుగా పోరాటం చేసి తమ స్థలాన్ని కాపాడుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ  నిర్ణయాన్ని మార్చుకోవాలని లేనిపక్షంలో విద్యార్థుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందంటూ విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. నిరసనలు తెలుపుతున్నవారిని పోలీసుల అరెస్టులు చేయడంపై వారు మండిపడుతున్నారు. విద్యార్థులకు బీఆర్ఎస్, బీజేపీలు మద్దతు పలికాయి. దీంతో క్యాంపస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.