బుధవారం, 2 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 మార్చి 2025 (15:25 IST)

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

crime
దైవదర్శనానికి వచ్చిన ఓ యువతిపై కొందరు కామాంధులు సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగింది. ఈ ఆలయానికి అనేక మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తుంటారు. 
 
ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి బంధువులతో కలిసి శనివారం సాయంత్రం వచ్చి దైవదర్శనం చేసుకున్నారు. ఆ రాత్రికి అక్కడే నిద్రించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆ యువతి ఒంటరిగా కాలకృత్యాల కోసం సమీప గుట్ట ప్రాంతానికి వెళ్లగా అక్కడ మాటువేసివున్న కొందరు యువకులు ఆమెను అటకాయించారు. 
 
ఆ తర్వాత ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడి చేసి చేతులు కట్టేసి, ఆ యువతిని మాత్రం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఊర్కొండపేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులను నిందితులుగా గుర్తించారు. వీరిలో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలినవారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.