బుధవారం, 2 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 31 మార్చి 2025 (10:00 IST)

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Jaggareddy
Jaggareddy
మాస్ లీడ‌ర్, జ‌న‌నేత జ‌గ్గారెడ్డి సినిమా ఆఫీస్ లాంఛ‌నంగా ప్రారంభించారు ఆయ‌న కుమార్తె  జ‌య‌ల‌క్ష్మీ రెడ్డి , భ‌ర‌త్ సాయి రెడ్డి. ఉగాది ప‌ర్వ‌దినాన ప్రారంభ‌మైన ఈ సినిమా ఆఫీస్ లో జ‌రిగిన  పూజ‌లో పాల్గోన్నారు జ‌గ్గారెడ్డి. విద్యార్థి నాయ‌కుడి గా ప్ర‌యాణం మొద‌లు పెట్టి అంచెలంచెలుగా రాష్ట్ర‌నాయ‌కుడిగా ఎదిగిన జ‌గ్గారెడ్డి రాజ‌కీయాల్లో అంద‌రికీ ఆద‌ర్శం. ఆయ‌న సినిమా రంగంలో అడుగుపెడుత‌న్న క‌థ‌లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. 
 
జ‌గ్గారెడ్డి పేరుతో నిర్మాణం కానున్న ఈ మూవీ ప్రీపొడ‌క్ష‌న్ పనులు శ‌ర‌వేగంగా న‌డుస్తున్నాయి. త్వ‌ర‌లో ప్రారంభంకానున్న జ‌గ్గారెడ్డి సినిమా ఆఫీస్ ఉగాది ప‌ర్వ‌దినాన ఆరంభించారు. ఈ సంద‌ర్భంగా మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేసింది టీం. మోస్ట్ ప‌వ‌ర్ ప్యాక‌డ్ మాస్ లీడ‌ర్ గా గ్లింప్స్ లో క‌నిపించారు జ‌గ్గారెడ్డి.
 
ఈ సంద‌ర్భంగా  మాస్ లీడ‌ర్ జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ, ద‌ర్శ‌కుడు రామానుజం చూపించిన జ‌గ్గారెడ్డి వార్ ఆఫ్ ల‌వ్ పోస్ట‌ర్ కి మొద‌ట ఆక‌ర్షితుడున‌య్యాను.  ఆత‌ర్వాత ఆయ‌న చెప్పిన క‌థ నాకు న‌చ్చింది . అందులో నా పాత్ర నాదే.  ఎవ‌రో రాసిన మాట‌లు పాత్ర‌లు గా నేను ఉండ‌ను. అంతా ఒరిజిన‌ల్,  మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు. విద్యార్థి నాయ‌కుడిగా మొద‌లైన నా ప్ర‌యాణం రాష్ట్ర నాయ‌కుడి వ‌ర‌కూ వచ్చిందంటే అందులో చాలా మ‌లుపులున్నాయి. కుట్ర‌లు, కుతంత్రాలు, హాత్యా ప్ర‌య‌త్నాలు దాటుకోని ఇంత‌వ‌ర‌కూ చేరిన నా ప్ర‌యాణం ఈ క‌థ‌లో క‌న‌ప‌డుతుంది. సినిమా ఇండ‌స్ట్రీ లో కూడా నాప్ర‌యాణం మొద‌లైంది. దీనికి అడ్డా గా ఈ ఆఫీస్ ఉంటుంది. ఇది జ‌గ్గారెడ్డి అడ్డా అనుకోండి.. అన్నారు..
 
ద‌ర్శ‌కుడు వ‌డ్డి రామానుజం మాట్లాడుతూ, సంగారెడ్డి కి వెళ్లి జ‌గ్గారెడ్డి గారి గురించి తెలుసుకున్నాను.  ఇందులో జ‌గ్గారెడ్డి గారి పాత్ర తో పాటు మంచి ప్రేమ‌క‌థ‌కూడా ఉంటుంది. జ‌గ్గారెడ్డి గారి పాత్ర అద్దంలా ఉంటుంది. కానీ దాన్ని ప‌గుల కొడితే అది ఒక ఆయుధం అవుతుంది. అదేఆయ‌న పాత్ర. జ‌గ్గారెడ్డి గారు ఎంత మాస్ లీడ‌రో అంద‌రికీ తెలుసు. ఆయ‌న జీవితంలోని ముఖ్య సంఘ‌ట‌న‌లు ఈ సినిమాలో క‌నిపిస్తాయి.  త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు న‌డుస్తున్నాయి. అన్నారు.
 
నిర్మాత జ‌య‌ల‌క్ష్మీ రెడ్డి మాట్లాడుతూ, మా నాన్న‌గారు జ‌గ్గారెడ్డి జీవితంలో కొన్ని సంఘ‌ట‌న‌లు విన్నాను. వాటిని తెర‌మీద చూడ‌బోతున్నాం  అనే ఆలోచ‌నే న‌న్ను ఎగ్జైట్ చేస్తుంది. సినిమా కూడా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. అన్నారు.