1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Raptadu incident: Accused Hemant discharged from Kurnool GGH

రాప్తాడు ఘటన నిందితుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ (Video)

Raptadu Incident Accused Hemanth Right Leg Removed
అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న హేమంత్ బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మెరుగైన చికిత్స కోసం ఈ నెల 13వ తేదీ రాత్రి పోలీసులు అతడిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించగా, అక్కడ కార్డియాలజీ ఐసీయూలో నాలుగు రోజుల పాటు వైద్యులు చికిత్స అందించారు. 
 
ప్రస్తుతం అతని రక్తపోటు, నాడి వేగం, ఊపిరితిత్తుల్లో రక్త ప్రసరణ సాధారణ స్థితికి చేరుకోవడంతో, అతని ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడింది. ఐదు రోజుల చికిత్స అనంతరం అధికారులు అతడిని డిశ్చార్జ్ చేశారు. వైద్య నివేదికను న్యాయమూర్తికి సమర్పిస్తామని జీజీహెచ్ అధికారులు పేర్కొనగా, పోలీసులు హేమంత్‌ను అనంతపురం సబ్-జైలుకు తరలించారు.

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
విమానంలో వృద్ధ దంపతులు : వీడియోను షేర్ చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్