1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 103 migrant migration to Quarantine

క్వారంటైన్‌ కు 103 మంది వలసకార్మికుల తరలింపు

migrant migration
రవాణా సదుపాయం లేక లారీలలో ప్రయాణిస్తున్న సుమారు 103 మంది వలస కార్మికులను శుక్రవారం ఉదయం తుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లారీలను సీజ్‌ చేసి అదుపులోకి తీసుకున్నవారినందరిని తుని గ్రామీణ హంసవరం ఎపి మోడల్‌ స్కూల్‌ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటరుకు తరలించారు.

ఎపి 39 టిడి-2939 లారీలో 39 మంది హనుమాన్‌ జంక్షన్‌ నుండి అనకాపల్లికి, ఎపి 39 టిడి-2777 లారీలో 31 మంది రాజమండ్రి నుంచి అనకాపల్లికి, ఎపి 39 టిడి 1249 లారీలో 33 మంది కత్తిపూడి నుండి అనకాపల్లి కి వెళ్లేందుకు లారీలలో ప్రయాణిస్తున్నారని తెలిపారు.

తుని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌ పోస్ట్‌ వద్ద తుని పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా... మూడు లారీలలో ప్రయాణిస్తున్న మొత్తం 103 మంది వలస కార్మికులను గుర్తించామన్నారు.

అప్రమత్తమైన పోలీసులు ప్రయాణిస్తున్నవారినందరిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తుని రూరల్‌ సిఐ కిషోర్‌, కోటనందూరు ఎస్సై అశోక్‌, బోర్డర్‌ విధులలో ఉన్న విశాఖ ఏపీఎస్పీ ఆర్‌ఐ రాజు, పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
మండే ఎండలో కరోనా వైరస్ చనిపోతుందా? ఆ ప్రొఫెసర్ ఏమంటున్నారు?