ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (07:14 IST)

ఉస్మానియా యూనివర్శిటీలో నకిలీ సర్టిఫికేట్ల దందా... 12 మంది అరెస్టు

దేశంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికేట్ల దందా కలకలం రేపుతోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఈ సిట్... ఈ నకిలీ సర్టిఫికేట్ల దందాతో సంబంధం ఉన్నట్టుగా అనుమానిస్తున్న 12 మందిని అరెస్టు చేసింది. వీరివద్ద పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తుంది. 
 
అయితే, ఈ నకిలీ సర్టిఫికేట్ల దందాకు ప్రధాన కారణం యూనివర్శిటీ సిబ్బంది సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ప్రాథమిక ఆధారాల కోసం వారు అన్వేషణ సాగిస్తున్నారు. ఆ తర్వాత యూనివర్శిటీ సిబ్బందిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని సిట్ అధికారులు వెల్లడించారు. పైగా, తమ తదుపరి దర్యాప్తు యూనివర్శిటీ సిబ్బంది కేంద్రంగా సిట్ అధికారులు దృష్టిసారించారు.