1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (20:19 IST)

ఉస్మానియా వర్శిటీలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం

ఉస్మానియా యూనివర్శిటీలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు ఓయూ విద్యార్థి నాయకులు. ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లతో అమెరికాలో చదువుతున్న ముద్దం స్వామిపై సీపీకు ఫిర్యాదు చేశారు.
 
ఇక, నకిలీ సర్టిఫికెట్ వ్యవహారాన్ని ఉస్మానియా అధికారులు కూడా ధృవీకరించారు. నకిలీ సర్టిఫికెట్లు పొందారో సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. పలువురు ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లారు అని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
 
ఈ వ్యవహారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని, ముద్దం స్వామిని 10 రోజులలో అదుపులోకి తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చినట్టు విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు.