1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (19:12 IST)

క్లాస్‌ల నిర్వహణపై OU కీలక నిర్ణయం: ఆన్‌లైన్ క్లాసులకే ఓటు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలను ఫిబ్రవరి ఒకటో తారీకు నుంచి ప్రారంభించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ మాత్రం ఆన్‌లైన్ క్లాసులు కొనసాగింపుకే మొగ్గుచూపింది. 
 
ఇకపోతే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.
 
అంతేకాదు ఫిబ్రవరి 12వ తేదీ వరకు పీజీ, యూజీ అన్ని సెమిస్టర్‌లకు సంబంధించి ఆన్‌లైన్ పాఠాలు కొనసాగించాలని ప్రకటన కూడా జారీ చేసింది.
 
అంతేకాదు కరోనా నేపథ్యంలో ఇంకా కొన్ని రోజుల పాటు ఆన్‌లైన్ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు ప్రిన్సిపాల్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.