శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (08:43 IST)

తెలంగాణాలో నేటి నుంచి ఆన్‌లైన్ తరగతులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అదేసమయంలో విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నేటి నుంచి ఆన్‌లైన్ తరగతులను నిర్వహించనున్నారు. 
 
టీశాట్ ద్వారా 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు సోమవారం నుంచి డిజిటల్ విధానంలో ఈ నెల 28వ తేదీ వరకు పాఠ్యాంశాలను బోధిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీశాట్, దూరదర్శన్, యాదగిరి చానళ్ళ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు ప్రసారం చేస్తారు. 
 
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న సిబ్బంది 50 శాతం మేరకు హాజరుకావాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది.