ఓడిపోయిన తర్వాత కూడా నేను పనికిరానా? జగన్‌కు శ్రీరెడ్డి ప్రశ్న (వీడియో)
పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎలాగో నేను పనికిరాకుండా పోయాను.. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా నేను పనికి రాకుండా పోయానా అంటూ నటి, వైకాపా మహిళా నేత శ్రీరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆమె ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. మీరు బాగున్నపుడు మీ వద్దకు వచ్చి పదవులు ఇవ్వాలని అర్రులు చాచలేదు. మీరు ఓడిపోయిన తర్వాత కూడా నేను పనికిరానా. పార్టీ కోసం మనం కష్టపడినపుడు, మన జీవితాలను త్యాగం చేసి, మన సమయాన్నంతా వెచ్చించినపుడు పార్టీ మనకు విలువ ఇవ్వలా లేదా అని ప్రశ్నించారు. పైగా, గలీజ్ ముండలంతా పార్టీలోకి వచ్చి ఇపుడు మైకుల ముందు జొల్లు కార్చుకుంటూ మాట్లాడుతుంటే ఇక్కడ కాలిపోతోంది అంటూ మండిపడ్డారు. పైగా, పార్టీ కోసం కష్టపడింది నేనని, ఇపుడు నా కెరీర్ గురించి మాట్లాడాలని ఆమె కోరారు.
తిరగబడిన కడప పౌరుషం - పాతికేళ్లుగా పేరుకుపోయిన ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది...
ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన, చర్చించుకోవాల్సిన ఫలితం కడప జిల్లాలో జరిగిన ఎన్నికలు. కడప మున్సిపల్ కార్పొరేషన్ అయిన తొలి నాళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయించింది. ఆ తర్వాత వైకాపానే హవా సాగించింది. అయితే, తాజాగా జరిగిన ఎన్నికల్లో కడప గడ్డపై పాతికేళ్లుగా పేరుకుపోయిన ఏకఛత్రాధిపత్యానికి కడప ప్రజలు తెరదించారు. కడప ప్రజల పౌరుషం తిరగబడటంతో ఈ పరిస్థితి వచ్చింది. ఫలితంగా వైకాపా కంచుకోటగా భావించే కడప జిల్లాలో ఆ పార్టీ తుడిచిపెట్టుకునిపోయింది. ఇది కేవలం ఒక రాజకీయ కూటమి సాధించిన విజయం కాదు. అహంకారంపై సామాన్యుడు సాధించిన సంచలన విజయంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
సొంత వైకాపా కార్యకర్త పెద్ద దస్తగిరిని ఆసుపత్రి వద్ద దారుణంగా దాడి చేసి చంపారనే తీవ్ర ఆరోపణలు... అదే మార్చురీ వద్దకు వెళ్లి కంటినీరు పెట్టుకుంటూ ఆడిన నాటకాలు... ఈ కేసులోనే మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి అరెస్టు అయి బెయిల్ మీద బయటపడ్డారు. అంతటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భార్య బండి దీప్తికి మేయర్ టికెట్‌ను వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టి, కడప ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారు అనే చర్చ ప్రజల్లో జరిగింది. ముఖ్యంగా, సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన వైఎస్ అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామనే అహంకారమే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పనిచేస్తుందని జగన్ భావించారు. కానీ ప్రజలు ఎపుడూ గొర్రెల మంద కాదని తమ ఓటు హక్కుతో నిరూపించారు.
ఇకపోతే, కడప మహిళా ఎమ్మెల్యే మాధవి రెడ్డి కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి వస్తే కనీసం కుర్చీ కూడా ఇవ్వకుండా అవమానించారు. ఆఖరికి నగర కూడళ్లలో నేరస్థుల కదలికలను కనిపెట్టేందుకు సీఎస్ఆర్ కింద ఎమ్మెల్యే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే, దానిపై కూడా హేళన చేస్తూ ట్రోల్స్ చేశారంటే వైకాపా నేతల, శ్రేణుల తెగింపు ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో బండి దీప్తితో రోజుకో భయానక సీన్, కన్నీటి నాటకాలతో సాక్షి, వైకాపా సోషల్ మీడియా సాగించిన హారర్ ప్రచారాలు ప్రజలను మభ్యపెట్టలేకపోయాయి.
కానీ... భయం కూడా ఒక పరిమితి వరకే ఉంటుంది. సహనం నశించి, బరితెగింపు హద్దులు దాటినప్పుడు, అదే జనం తిరగబడి ప్రజాస్వామ్య బడితపూజ ఎలా ఉంటుందో ఈ ఎన్నికల్లో ప్రజలు రుచి చూపిస్తారు. భయాన్ని గుండెల్లోంచి తరిమేసి, అరాచక మూకకు చరమగీతం పాడుతూ, అభివృద్ధి మరియు ప్రజాస్వామ్యం వైపు దేవుని కడప గడ్డ అడుగులు వేసింది. భయాన్ని బద్దలు కొట్టి, కొత్త చరిత్రకు నాంది పలికిన కడప ప్రజలకు శుభాభినందనలు.
ప్రచారానికి శ్యామలని పిలిచారు కానీ పార్టీలో సీనియర్ అయిన తనని పిలవలేదు అని వైసీపీ అధినాయకత్వంపై మండి పడ్డ వైసీపీ సీనియర్ మహిళా నేత శ్రీ రెడ్డి https://t.co/3bJ4T0FYmF
— Twood Trolls ™ (@TwoodTrolls_2_0) November 3, 2026

