1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YS Jagan Mohan Reddy returns from Pulivendula without casting his vote.

రీపోలింగ్ నిర్వహిస్తేనే ఓటు వేస్తా : పులివెందుల సిట్టింగ్ ఎమ్మెల్యే జగన్

ys jagan
కడప జిల్లా పులివెందులలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గత దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచకోటగా ఉన్న పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి చుక్కెదురైంది. ఏపీలో ఆదివారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటు వేసేందుకు విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పులివెందులకు ప్రత్యేక హెలికాఫ్టరులో వచ్చిన ఆయన... తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. పులివెందులలో ఎన్నికల ప్రక్రియ అప్రజాస్వామికంగా మారిందని, అధికార టీడీపీ నేతలు యధేచ్చగా రిగ్గింగ్, దౌర్జన్యాలకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. రీపోలింగ్ నిర్వహిస్తేనే తాను ఓటు వేస్తానని స్పష్టం చేశారు. 
 
పులివెందులోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన జగన్.. అక్కడ నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశఆరు. "నేను ఓటు వేయను. ఒకవేళ నేను ఓటు వేస్తే అంతా సజావుగా సాగుతోందని, అంతా సవ్యంగా ఉందని ప్రజలు అనుకుంటారు. కానీ, ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. పులివెందులలో ఎన్నికలు రద్దు చేసి, రీపోలింగ్ పెడితేనే మళ్లీ వచ్చి ఓటు వేస్తాను. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో  ప్రజలకు తెలియాలి. ఇవాళ ఓటు పోతుంది. రేపు మీ ఆస్తులే పోతాయి. ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారుల చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు అంటూ విమర్శలు గుప్పించారు. 
 
పులివెందులలో రీపోలింగ్‌కు జగన్ డిమాండ్... 
 
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అయితే, కడప జిల్లా పులివెందులలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు జగన్ ఆదివారం పులివెందులకు వచ్చారు. ఈ సందర్భంగా పులివెందులలో ఆర్వో కార్యాలయం ఎదుట జగన్ బైఠాయించి నిరసన చేపట్టారు. అక్కడికి వచ్చిన అధికారులతో ఆయన మాట్లాడారు. పులివెందులలో రీపోలింగ్‌ నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. 
 
'మీకు పైనుంచి ఆదేశాలు ఏమైనా రావచ్చు. ఒత్తిళ్లు వచ్చినా మీ అధికారాన్ని వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న వారిని అడ్డుకోవాలి. మీరు ఏం చేసినా ఇక రెండేళ్లే. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇప్పుడు జరిగిన అన్ని ఘటనలపై విచారణ చేయిస్తాం. నేను పిలుపు ఇచ్చి ఉంటే ఈ ఎన్నికలు ఆగపోయేవి. ప్రజాస్వామ్యంపై గౌరవంతోనే నేను అలా చేయలేదు. మాజీ సీఎం నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా? మా ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం' అని జగన్‌ అన్నారు. 
 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
'మురసు' తుఫాను : నెల్లూరు - నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం