సంబంధిత వార్తలు
- ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు
- ఇంటర్ పరీక్షలు మినహా అన్ని పరీక్షలు రద్దు.. ఆల్‌పాస్ : సబితా ఇంద్రారెడ్డి
- గుంటూరు ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు: నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్ చేసి దొరికిపోయారు
- చైనాలో ఘోర ప్రమాదం.. 21మంది మృతి.. 15మందికి గాయాలు
- లవ్ పేరుతో వంచించి విద్యార్థిని నగ్న వీడియో, ఆపై 'మై నేమ్ ఈజ్ 420', ఏమైంది?
ఆంధ్రప్రదేశ్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతితో దాదాపు 6లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో.. ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ కంపార్ట్‌మెంటల్‌లో ఉత్తీర్ణులైనట్లు మార్కుల జాబితాలో పేర్కొంటామని ఇంటర్‌బోర్డు సెక్రెటరీ వి.రామకృష్ణ తెలిపారు.
ఫెయిలయిన విద్యార్థులందరికీ కంపార్ట్‌మెంటల్‌లో పాస్ చేస్తున్నట్లు వి.రామకృష్ణ చెప్పారు. మార్చిలో జరిగిన ఫస్టియర్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోరుకునేవారు 2021 మార్చి-ఏప్రిల్‌లో సెకండియర్ విద్యార్థులతో పాటు మళ్లీ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.
