చైనాలో ఘోర ప్రమాదం.. 21మంది మృతి.. 15మందికి గాయాలు
చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో అదుపు తప్పిన ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. గుయ్‌జో ప్రావిన్స్‌లో అన్షున్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రయాణికులతో నిండి ఉన్న బస్సు అదుపుతప్పి హోంగ్ షాన్ చెరువులో పడిపోయింది. చెరువులో సగభాగం వరకు మునిగిపోవడంతో 21మంది మరణించారు.
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లైంతైన వారి కోసం గాలిస్తున్నారు.
బస్సులో గావోకా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారని.. పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై గుయ్‌జో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.