1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Alla Ramakrishna Reddy About CID Investigation | TDP Office Attack Case

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

Alla Ramakrishna Reddy
విజయవాడ గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయపై తమ పార్టీ నేతల ఒత్తిడి మేరకు దాడి జరిగిందని, ఇలా దాడి చేయడం తప్పేనని వైకాపాకు చెందిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే) అభిప్రాయపడ్డారు. అయితే, ఈ దాడి గురించి తనకు తెలియదని, దాడి జరిగిన రోజున తాను పొలం పనుల్లో ఉన్నానని చెప్పారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆళ్ల పేరును సీఐడీ పోలీసులు 127వ నిందితుడుగా చేర్చిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో శనివారం ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యారు. తన మిత్రుడుతో కలిసి స్కూటరుపై గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి వచ్చిన ఆళ్లను సీఐడీ అధికారులు రెండు గంటల పాటు విచారించారు. 
 
ఈ విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాడి జరిగిన రోజు తాను పొలంలో ఉన్న విషయాన్ని అధికారులకు చెప్పానని, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పినట్టు తెలిపారు. ఘటన జరిగిన ఒక యేడాది తర్వాత ఈ కేసులో తన పేరు చేర్చడం దారుణమన్నారు. 
 
ఈ దాడిలో తన పాత్ర ఏమాత్రం లేదన్నారు. గతంలో నారా లోకేశ్‌పై గెలిచినందుకే తనను ఈ కేసులో ఇరికించారన్నారు. 2014-29 వరకు చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించానని, అందుకే ఇపుడు రాజకీయ కక్షతో చార్జిషీటులో తన పేరును చేర్చారని చెప్పారు. ఈ కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని