సంబంధిత వార్తలు
- ఏపీ ప్రజలను భయపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు: ఏపీ అసెంబ్లీ ఆమోదం (video)
- అధికారిక రికార్డుల్లో తన పేరు - లింగాన్ని మార్చుకు ఐఆర్ఎస్ అధికారి!!
- 'తెలంగాణ స్టేట్' కాస్త 'తెలంగాణ' అయింది.. ఇకపై "టిజి" మార్కుతో వాహనాల రిజిస్ట్రేషన్
- తిరుత్తణి, తిరుపతి అనుసంధానం.. రూ.1,346.81 కోట్ల కేటాయింపు
- గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన తెలంగాణ మంత్రివర్గం
అమరావతి రైలు మార్గ నిర్మాణానికి రైల్వే బోర్డు ఆమోదం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రైలు మార్గం అనుసంధానం కోసం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైనుకు సంబంధించిన డీపీఆర్ (సవివర ప్రాజెక్టు నివేదిక)కు రైల్వేబోర్డు అమోదం తెలిపిన తర్వాత నీతి ఆయోగ్ ఆమోదముద్ర వేసిందని మండల రైల్వే అధికారి(డీఆర్ఎం) రామకృష్ణ తెలిపారు. గుంటూరులోని రైలి విహార్ క్రీడా మైదానంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ గురువారం ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో భాగంగా, ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి రైల్వే రక్షక దళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రామకృష్ణ మాట్లాడారు. ఈ మార్గంలో కృష్ణానదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నామన్నారు. గుంటూరు - బీబీనగర్ రెండో లైను నిర్మాణానికి రూ.2,853 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో 48 కి.మీ మార్గం నిర్మాణం పనులు వచ్చే నెలలో ప్రారంభమవుతాయన్నారు.
గుంటూరు - గుంతకల్ మార్గంలో మొత్తం 400 కిలోమీటర్ల నిర్మాణంలో ఇంకా 100 కి.మీ మాత్రమే మిగిలిందన్నారు. నడికుడి - శ్రీకాళహస్తి మార్గంలో మొత్తం 308 కి.మీకి ఇప్పటివరకు 75 కి.మీ పూర్తయిందన్నారు. అమృత్ పథకం కింద 16 స్టేషన్ల అభివృద్ధికి రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గత ఏడాది డివిజన్ రూ.671 కోట్ల ఆదాయం ఆర్జించగా, ఈ యేడాది జులై వరకు రూ.208.713 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
తర్వాతి కథనం
