శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (16:48 IST)

ఏపీ ప్రజలను భయపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు: ఏపీ అసెంబ్లీ ఆమోదం (video)

Pawan Kalyan- Chandrababu
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎంతగానో భయపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ను రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ చట్టంతో ఏపీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమకు తెలియకుండానే భూములు వేరెవరో తమ భూముల్లో కలిపేసుకోవచ్చనీ, అలాగే భూమి విస్తీర్ణం తప్పులు దొర్లితే దాన్ని సరిచేసుకోవాలంటే రైతులకు చుక్కలు అగుపిస్తాయన్న... ఇత్యాది అనేక అంశాలతో ఈ చట్టం వున్నది.
 
దాంతో ఏపీ ప్రజలు ఈ చట్టంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసారు. దాంతో ఆనాడు తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇద్దరూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తాము అధికారంలోకి రాగానే వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారం నేడు అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే ఆరోగ్య వర్శిటీ పేరు మార్పు బిల్లు కూడా ఆమోదం పొందింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ రెండు బిల్లులు ఆమోదం పొందినట్లు సభలో ప్రకటించారు.