సంబంధిత వార్తలు
- సింగపూరులో అంబులేను కలిసిన చంద్రబాబు.. పెట్టుబడుల కోసం చర్చలు
- Thunderstorm : ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు
- తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - పలు జిల్లాలకు హెచ్చరిక
- జగన్ బహిరంగ సభలకు అనుమతి ఎందుకివ్వలేదు.. పవనే చెప్పాలి: రేవంతన్న
- ఇది మన కోనసీమే.. కేరళ మున్నార్ కాదు... శెభాష్ పవన్ (వీడియో)
కాక్రోచ్ పార్టీని చూస్తే.. చలిచీమల పద్యం గుర్తుకొచ్చింది.. : పవన్ కళ్యాణ్
తాను పార్టీ స్థాపించినపుడు అధికారం వస్తుందో రాదో కూడా తెలియదని, అపుడు తన మనసులో దేశ సమగ్రత, శ్రేయస్సు తప్ప మరో ఏ ఆలోచనా లేదని జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం అనే పేరుతో ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిందని, ఈ ప్రయాణంలో చాలా పోరాటాలు చేశామని, పరాజయాలు ఎదుర్కొన్నామన్నారు.
'మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా 7 ప్రాథమిక సూత్రాలను వదల్లేదు. నిర్దిష్ట ఆచరణాత్మక విధానంతో 21 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలను సాధించాం. లక్ష మంది సభ్యత్వంతో ప్రారంభమైన పార్టీకి.. 20 లక్షలకుపైగా సభ్యత్వాలు వచ్చాయి. ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాల నుంచి వేల మంది పార్టీలో చేరుతున్నారు. పార్టీ ప్రయోజనాల కంటే.. దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం ఒక రోజుతో అయ్యే పని కాదు. దేశ స్ఫూర్తిని ప్రతితరం ముందుకు తీసుకెళ్లాలి.
తెలంగాణ ఏర్పాటుకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదు. 2014లో ఏపీని విభజించిన తీరును చూసి మాత్రమే ఆవేదన వ్యక్తం చేశాం. విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు.. అసంతృప్తిని, అశాంతిని సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటికీ వారి ధోరణి మారలేదు. జనసేన సభకు అనుమతివ్వకుండా అడ్డుకోవడమే అందుకు ఉదాహరణ. ఢిల్లీ మెడలు వంచుతాం.. తడాఖా చూపిస్తామంటూ చాలామంది పెద్దలు మాటలు చెబుతారు. వాస్తవానికి అలాంటి నేతలు ఢిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారు.
చాలాసార్లు మనకు మనం తక్కువగా అంచనా వేసుకుంటాం. ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మార్పు తీసుకురావొచ్చు. ఈ మధ్య కాక్రోచ్ పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో చూస్తున్నాం. కాక్రోచ్ పార్టీని చూస్తే.. చలిచీమల పద్యం గుర్తుకొచ్చింది. చలిచీమలు కూడా బలమైన పామును చంపేస్తాయి' అని పవన్ అన్నారు.
