1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. andhra pradesh, telangana weather forecast and rain warning for several districts

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - పలు జిల్లాలకు హెచ్చరిక

rain in telangana
రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు అల్పపీడనం విస్తరించిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. 
 
మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 
 
అదేవిధంగా శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వివరించారు. వర్షాలు, పిడుగులతో కూడిన ఉరుములు సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచింరాు. చెట్ల కింద, భారీ హోర్డింగులు సమీపంలో నిలబడటం సురక్షితం కాదని హెచ్చరించారు. 
 
అలాగే, తెలంగాణలో ఈ నెల 18 నుంచి 20 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని.. నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. సోమ, ముంగళవారం కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
'ఆకాశంలో ఒక తార' హీరోయిన్ స్నేహితురాలిపై అత్యాచారం