1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. heavy rains in telangana : cm revanth reddy key orders

భారీ వర్షాలు కురుస్తున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి

telangana police
తెలంగాణా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అందువల్ల అధికార, పోలీస్, అగ్నిమాపకదళ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా, హైదరాబాద్ క్యూర్ పరిధిలో హైఅలెర్ట్‌గా ఉండాలన్నారు. పోలీస్, ట్రాఫిక్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన కీలక ఆదేశాలు జారీచేశారు. 
 
హైడ్రా, విద్యుత్‌, వాటర్‌ బోర్డు, సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సీఎస్‌, డీజీపీ, క్యూర్‌ స్పెషల్‌ సీఎస్‌లతో సమీక్షించి నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా సత్వర చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో ముందస్తుగా టీమ్స్‌ మోహరించాలని తెలిపారు.
 
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. శంషాబాద్‌ వద్ద బెంగళూరు హైవేపై భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత సిబ్బంది.. మోటార్ల ద్వారా నీటిని తొలగిస్తున్నారు. షాద్‌నగర్‌లోనూ జాతీయ రహదారిపై భారీగా వరద నిలిచింది.
 
అదేసమయంలో హైదరాబాద్‌లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించారు. మల్కంపేట చెరువు, టోలిచౌకీల్లో పరిస్థితిని పరిశీలించారు. సైబరాబాద్ సీపీ రమేష్‌తో కలిసి నీటమునిగిన ప్రాంతాలు, ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించారు. కీలక జంక్షన్లలో అదనపు పోలీసు సిబ్బందిని మోహరించాలన్నారు. హైదరాబాద్‌తో పాటు వర్ష ప్రభావిత జిల్లాల పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
అమెజాన్‌లో ఏడాదిలో రెండు రెట్లు పెరిగిన ద్విచక్ర వాహనాల విక్రయాలు