1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Madhavi Latha Counter to Rahul Ramakrishna

పవన్ కళ్యాణ్ ఒక పర్ఫెక్ట్ మ్యాన్.. తెలంగాణకు వస్తే మంచే జరుగుతుంది.. మాధవీలత

Madhavilatha
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన వరుస ట్వీట్లపై నటి, బీజేపీ నేత మాధవీలత స్పందించారు. రాహుల్ రామకృష్ణ వైఖరిని తప్పుపడుతూ ఆమె అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ రామకృష్ణ కేవలం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహి అవ్వరని.. కానీ ఆయన ధోరణి చూస్తుంటే భయం వేస్తోందని మాధవీలత వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణలో ఆంధ్రావాళ్లు ఉండకూడదు, మార్వాడీలు ఉండకూడదు, అందరూ వెళ్లిపోవాలి.. మీరు ఒక్కరే మిగలాలా? తెలంగాణ అనేది భారతదేశంలో ఒక భాగమనే విషయం మర్చిపోవద్దు అంటూ ఆమె మండిపడ్డారు. 
 
పవన్ కళ్యాణ్ నిస్వార్థమైన నాయకుడని, ఆయన ఎలాంటి భూకబ్జాలు చేయరని, ఎవరి సొమ్ము తినరని మాధవీలత స్పష్టం చేశారు. రాజకీయాల్లో చట్టాలు, రాజ్యాంగ పరిధులు, అధికారులు సహకరించినంత మేర పవన్ కళ్యాణ్ అద్భుతంగా పనిచేయగలరు. 
 
ఆయన నియోజకవర్గ ప్రజలకు, ఏపీ ప్రజలకు ఆయన ఏం చేస్తున్నారో బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ ఒక పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు దొరికిన ఒక ఆణిముత్యం. ఒకవేళ ఆయన తెలంగాణలో రాజకీయం చేయాలనుకుంటే.. ఇక్కడి ప్రజలకు కూడా ఒక మంచి నాయకుడు దొరికినట్లేనని కొనియాడారు. 
 
అందరికీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉద్దెరగా దొరికారని, వేరే ఏ నాయకుడినీ ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదని మాధవీలత ఎద్దేవా చేశారు. పవన్‌ను అడిగే ప్రశ్నలేవో సొంత రాష్ట్రంలో ఉన్న మంత్రులను అడిగితే బాగుంటుందని రాహుల్ రామకృష్ణకు గట్టిగా హితవు పలికారు. 
 
గతంలో ఆజాద్ కాశ్మీర్ పేరుతో కొందరు భారత్ నుంచి కాశ్మీర్‌ను వేరు చేయాలని చూశారు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ కూడా తెలంగాణ పేరుతో అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నట్లు కనిపిస్తోందని మాధవీ లత అన్నారు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
టీఎంసీలో పెను ప్రకంపనలు - 20 మంది ఎంపీల షాక్ - ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది.?