1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Top Scenic Road Routes in Konaseema

ఇది మన కోనసీమే.. కేరళ మున్నార్ కాదు... శెభాష్ పవన్ (వీడియో)

konaseema village road
కోనసీన ప్రజలు ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిలో బాటలో పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా, కోనసీమ ప్రాంతాలు పచ్చటి ప్రాంతాల మధ్య అద్దంలాటి రహదారులతో సరికొత్త అందాన్ని సంతరించుకున్నాయి. ఈ ప్రాంతాలను చూస్తుంటే ఇది మన కోనసీమనా లేక కేరళ రాష్ట్రంలోని మున్నారా అనే సందేహం వచ్చేకనిపిస్తున్నాయి. ఇలాంటి రహదారులు కోనసీమ అభివృద్ధికి మరో మైలురాయిగా ఉంది. 
 
బోడసకుర్రు - బెండమూర్లంక గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి కావడం స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనకరం. మెరుగైన రవాణా సౌకర్యాలు, సురక్షిత ప్రయాణం, గ్రామీణ అభివృద్ధికి ఈ రహదారి దోహదపడనుంది. గ్రామాల అభివృద్ధి, ప్రజల సౌకర్యాలే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న చర్యలు ఫలితాల రూపంలో కనిపిస్తున్నాయి. మాటల్లో కాదు.. పనుల్లో అభివృద్ధి చూపిస్తూ ముందుకు సాగుతున్న నాయకత్వానికి ఇది మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాల్ చేశారు.. రూ.80వేలు పంపిన వ్యక్తి.. అంతా మోసం (video)