సంబంధిత వార్తలు
- ప్రాణ వాయువు తీసుకొచ్చి కోవిడ్ బాధితుల ప్రాణాలు నిలబెట్టిన నాలుగో సింహం, శభాష్ పోలీస్
- కిలాడీ లేడీ మోసాలకు చెక్ పెట్టిన నల్లగొండ జిల్లా పోలీసులు
- కరోనా బారినపడి కరోనాని జయించిన పోలీస్: విధులకు ఆహ్వానించిన ఎస్పీ
- కొప్పురావూరులో ప్రేమికుడి కళ్లలో కారం కొట్టి కాళ్లూ చేతులూ నరికింది వీళ్లే
- 1000 మందికి పైగా పోలీసులకు కరోనా
పుచ్చకాయల వ్యాపారిపై దాడి: వీఆర్‌లోకి పోలీసులు
గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం, ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సైతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌లోకి పంపుతూ పోలీసు శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. లాక్‌డౌన్ అమల్లో భాగంగా ఒకటో పట్టణ ఎస్సై వెంకటేశ్వర రావు, సిబ్బంది గురువారం రాత్రి గస్తీ తిరుగుతుండగా పల్నాడు రోడ్డులో నరసయ్య అనే పుచ్చకాయల వ్యాపారి దుకాణం తీసి ఉండటాన్ని గుర్తించారు.
కర్ఫ్యూ అమల్లో ఉండగా రాత్రి సమయంలో దుకాణం ఎందుకు తీశావని పోలీసులు ప్రశ్నించగా వ్యాపారి వారితో దురుసుగా వ్యవహరించాడు. దీంతో విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు వ్యాపారిని స్టేషన్‌కు రమ్మని చెప్పగా అందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుళ్లు సదరు వ్యక్తిపై చేయిచేసుకున్నారు. అనంతరం పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు.
దుకాణం వద్ద జరిగిన గొడవ అంతా సీసీ కెమెరాలో నమోదైంది. శుక్రవారం ఉదయం దుకాణం వద్దకు వచ్చిన వ్యాపారి సీసీ కెమెరాలో నిక్షిప్తమైన వీడియోను పోలీసు ఉన్నతాధికారులకు పంపాడు. స్పందించిన ఉన్నతాధికారులు ఎస్సై మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు. ముగ్గురిని వీఆర్‌లోకి పంపూతూ ఎస్పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులొచ్చాయని డీఎస్పీ విజయ భాస్కరరావు తెలిపారు.
తర్వాతి కథనం
