సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 1 మే 2021 (23:01 IST)

కిలాడీ లేడీ మోసాలకు చెక్ పెట్టిన నల్లగొండ జిల్లా పోలీసులు

పెండ్లి సంబంధాల పేరిట అబ్బాయిల పేర్లు మార్చి చెపుతూ మోసాలకు పాల్పడుతున్న యువతి. సామాజిక మాధ్యమాలు వేదికగా వలపు వల విసురుతూ డబ్బులు దండుకుంటున్న వైనం. పదుల సంఖ్యలో బాధితులు, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులు.
 
పెండ్లి సంబంధం కోసం మీ ఫోటో ఎవరికైనా ఇస్తున్నారా, ఆ వ్యక్తి గురించి మీకు అన్ని వివరాలు తెలిస్తేనే ఇవ్వండి..... లేదంటే ఇలా మోసపోతారని హెచ్చరిస్తున్నారు నల్లగొండ జిల్లా పోలీసులు
 
ఇలా అబ్బాయిల ఫోటోలను అమ్మయిల తల్లితండ్రుల వద్ద నకిలీ పేర్లతో, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటూ సంబంధం మాట్లాడతానని డబ్బులు దండుకుంటుంది ఈ కిలాడీ లేడి... అంతే కాదు తాను ఎవరి ఫోటోలైతే అమ్మాయిల తల్లితండ్రులకు చూపిస్తుందో వాళ్లను సైతం బెదిరిస్తూ తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ కేసులలో ఇరికిస్తానని బెదిరింపులకు పాల్పడుతుంది ఈ మాయలేడి... ఇలా మోసాలకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్న కిలాడీ లేడీని అరెస్ట్ చేసి ఆమె చేస్తున్న మోసాలకు ఫుల్ స్టాప్ పెట్టారు నల్లగొండ జిల్లా పోలీసులు...