సంబంధిత వార్తలు
- స్టెప్లతో అదరిస్తున్న నోరా ఫతేహి
- 12 ఏళ్లు దాటిన రోగులకు అలెర్జిక్ రినిటిస్ చికిత్స: యూరోప్‌లో అనుమతులు పొందిన గ్లెన్‌మార్క్ రియాలీట్రస్ నాజల్ స్ప్రే
- చంద్రుడిపై శృంగారం.. కానీ కుదర్లేదు.. మూన్ రాక్స్‌ను పడకపై వేసుకుని..?
- నాసా అదుర్స్.. అరుణ గ్రహంపై తొలిసారి హెలికాప్టర్ ఎగిరిందోచ్! (video)
- నాగార్జున సాగర్ ఉప ఎన్నిక : పైసా ఖర్చులేకుండా పూర్తయిన ఉగాది పండుగ
మానవ చరిత్రలో అపూర్వ ఘట్టం.. మార్స్‌పై హెలికాప్టర్ చక్కర్లు (video)
Helicopter
అంతేకాదు ఆ హెలికాప్టర్ సౌండ్‌ను కూడా రోవర్ తొలిసారి క్యాప్చర్ చేసి భూమిపైకి పంపించింది. ఆ సమయంలో అది రోవర్‌కు 80 మీటర్ల దూరంలో ఉంది. అంత దూరం నుంచి సౌండ్‌ను రికార్డు చేయగలదో లేదో అని సైంటిస్టులు భావించినా.. పర్సీవరెన్స్‌లోని మైక్ ఆ పని చేసి చూపించింది.
ఈ అద్భుతమైన 3 నిమిషాల ఆడియో, వీడియోను నాసా శుక్రవారం రిలీజ్ చేసింది. ఏప్రిల్ 30వ తేదీన నాలుగోసారి విజయవంతంగా మార్స్‌పై ఎగిరిన హెలికాప్టర్ వీడియో ఇది. జెజెరో క్రేటర్‌లో ఈ అధ్బుతం ఆవిష్కృతమైంది. నిమిషానికి 2400 సార్లు హెలికాప్టర్ బ్లేడ్లు తిరిగాయి.
మొత్తం 262 మీటర్ల దూరం ఇది ప్రయాణించి మళ్లీ కిందికి దిగింది. అది రోవర్ నుంచి దూరంగా వెళ్లినప్పుడు సౌండ్ తగ్గడం, దగ్గరగా రాగానే పెరగడం వీడియోలో గమనించవచ్చు. మార్స్ వాతావరణం మన భూవాతావరణ సాంద్రతలో కేవలం ఒక శాతం మాత్రమే ఉంటుంది. దీంతో అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది.
తర్వాతి కథనం
