1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Attacking state wealth: Chandrababu

రాష్ట్ర సంపదపై దాడి చేస్తున్నారు: చంద్రబాబు

state
600 రోజులుగా సాగుతున్న రైతుల పోరాటం ఒక చరిత్ర అని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజా రాజధానికి రైతులు 32,323 ఎకరాలు త్యాగం చేశారని చెప్పారు.

రైతులు, రైతు కూలీల న్యాయపోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అమరావతి ఆంధ్రుల రాజధాని మాత్రమే కాదన్నారు. ఆంధ్రులకు రూ. 2 లక్షల కోట్ల సంపద సృష్టించే కేంద్రం అమరావతి అన్నారు.

వైసీపీ చేస్తున్నది అమరావతిపై దాడి కాదు.. రాష్ట్ర సంపదపై దాడి చేస్తున్నారని చెప్పారు. విద్వేషంతో ప్రజా రాజధానిని జగన్‌ ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్‌ వల్ల 139 సంస్థలు అమరావతి ప్రాజెక్టు నుంచి వెనక్కి వెళ్లాయని చెప్పారు. అమరావతి అంతానికి వైసీపీ ప్రభుత్వం చేయని కుట్ర లేదన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే.. మరింత ఉద్ధృతమైందని హెచ్చరించారు.
తర్వాతి కథనం
విశేషాధికారాలు ఉన్నవారిపై కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు : జస్టివ్ ఎన్వీ రమణ