1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Backlash against Balakrishna in Hindupur!

హిందూపురంలో బాలకృష్ణకు ఎదురుదెబ్బ!

Backlash
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో ఉన్న 38 సర్పంచ్‌ స్థానాలకు గానూ 30 స్థానాల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.

పెనుకొండ టిడిపి మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధికి కూడా షాక్‌ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో సర్పంచ్‌ అభ్యర్థి, మరువపల్లిలో వార్డు అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైసిపి మద్దతుదారులు గెలుపొందారు.

హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టిడిపి బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందాడు. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న సొంత పంచాయతీ మద్దనకుంటలోనూ టిడిపికి పరాభవం తప్పలేదు.
తర్వాతి కథనం
ఫోన్‌ సిగ్నల్ కోసం 50 అడుగుల జెయింట్‌వీల్‌ ఎక్కిన మంత్రి