శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (18:16 IST)

కరోనా తరువాత రోజాని కలుస్తా.. బాలకృష్ణ ప్రకటన

బాలకృష్ణ, రోజా... ఈ కాంబినేషన్ సినిమాల్లో హిట్టు. కానీ రాజకీయాల్లో వీరిద్దరివీ భిన్న మార్గాలు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా వుంటే రోజా నగరి ఎమ్మెల్యే తో పాటు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ) చైర్మన్ గానూ వున్నారు.

కానీ ఇద్దరూ వ్యక్తిగతంగా ఎంతో గౌరవించుకుంటారు. అలాంటిది త్వరలో వీరిద్దరూ భేటీ కాబోతున్నారట. ఎమ్మెల్యే ఆర్కే రోజాతో త్వరలో సమావేశమవుతానని నందమూరి బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా అక్కడ మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

'రోజాతో ఇంతకు ముందే మాట్లాడాను. తప్పకుండా అభివృద్ధి చేద్దాం బాబు అని ఆమె చెప్పారు. ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు తన కార్యాలయానికి రావాలని, అధికారులందరినీ అక్కడికే పిలిపిస్తానని రోజా చెప్పారు. కరోనా తర్వాత ఒకసారి వెళ్లి కలుస్తా’ అని బాలకృష్ణ ప్రకటించారు.

వీరిద్దరి భేటీ ఎలా వుండబోతుందోనని టీడీపీ, వైసీపీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.