బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (18:48 IST)

హిందూపురం భక్త బృందం తిరుమల పాదయాత్ర

నేడు  ఉదయం 11 గంటలకు హిందూపురం పేట శ్రీ వెంకటరమణ స్వామి దేవాలయం నుండి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలి నడకన  దాదాపు 350 మంది భక్తాదులు బయలుదేరినారు.

ఈ భగవత్ పాదయాత్రను ముఖ్య అతిథులుగా  గోపికృష్ణ మాజీ ఎంపీ కొండూరు మల్లికార్జున రాయల్ గోపాల్ కల్లుకుంట అంజి డిఈ రమేష్ బాచి అమర్ రాము లింగంపల్లి రామంజి స్థానిక తహసీల్దారు శ్రీనివాసులు 1 టౌన్ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు బాలమద్దిలేటి మన్సూరుద్దీన్ లు  జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భక్తులు భక్తాదులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.