శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 8 జూన్ 2020 (19:13 IST)

జగన్ బాలకృష్ణకు వీరాభిమాని... మీకు తెలుసా? (video)

ఎపి సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని అన్న విషయం మీకు తెలుసా?.. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణే చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... "జగన్మోహన్‌ రెడ్డి నాకు వీరాభిమాని.. అప్పట్లో నందమూరి అభిమాన సంఘం కడప టౌన్‌ ప్రెసిడెంట్‌గా ఉండేవారు.

అయితే, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు'' అని చెప్పారు. బాల‌కృష్ణ‌కు జగన్మోహన్‌ రెడ్డి వీరాభిమాని అని, అప్పట్లో బాలయ్య అభిమాన సంఘానికి ఆయన అధ్యక్షుడిగా కూడా పనిచేశారని కిందటేడాది జూన్‌లో ఒక పేపర్‌ కటింగ్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యింది.

జగన్మోహన్‌ రెడ్డి, ప్రెసిడెంట్‌, కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం పేరిట 'సమరసింహారెడ్డి' పోస్టర్‌తో నూతన సంవత్సర శుభాకాంక్షలు (2000) తెలుపుతూ పేపర్‌లో వచ్చిన ప్రకటనను బాల‌కృష్ణ‌ అభిమానులు బాగా వైరల్‌ చేశారు.

అయితే, ఇది ఫేక్‌ అని అప్పట్లో చాలామంది ఖండించారు. 2003లో జగన్‌ తీసుకున్న ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఈ పేపర్‌ కటింగ్‌ను సృష్టించారని జగన్‌ అభిమానులు ఆరోపించారు. కానీ, ఇది నిజమేనని స్వయంగా బాల‌కృష్ణ‌ చెప్పడం చర్చనీయాంశమైంది.