1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Balakrishna’s Cancer Hospital Boost For Amaravati

అమరావతి: తుళ్లూరులో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభం- బాలయ్య

Balakrishna
నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నట్లు బాలయ్య తెలిపారు. ఈ ప్రాజక్ట్ ఆరోగ్య సంరక్షణ కోసమే కాకుండా.. ఇది ఏపీ రాజధాని అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా మార్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. 
 
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి అధిపతిగా ఉన్న బాలకృష్ణ, క్యాన్సర్ చికిత్సను అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా పేదలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తుళ్లూరు క్యాన్సర్ ఆస్పత్రిలో సీఎస్సార్ మద్దతుతో, ఏఐ ఆధారిత అల్ట్రాసౌండ్ పరికరాలను ప్రవేశపెడతామని బాలకృష్ణ వెల్లడించారు. 
 
2025 ఆగస్టు 13న అమరావతి యూనిట్‌కు భూమి పూజ జరిగిన రోజే ఈ ప్రాజెక్టుకు పునాదులు పడ్డాయి. దాదాపు 21 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు మొదటి దశ అంచనా వ్యయం రూ.750 కోట్లు. ఇందులో 500 పడకల సదుపాయాన్ని ఏర్పాటు చేయగా, దానిని 1,000 పడకల వరకు విస్తరించే అవకాశం ఉంది. 
తర్వాతి కథనం
భార్యను హత్య చేసిన పరారైన భర్త... పోలీసులకు పట్టించిన గ్యాస్ బుకింగ్