బర్త్‌డే పార్టీలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై వీడియోతో డబ్బు బేరం...
విశాఖపట్టణంలో దారుణం జరిగింది. స్నేహితుల బర్త్‌డే పార్టీకెళ్లిన బీటెక్ విద్యార్థినిపై తోటి స్నేహితులు అత్యాచారం చేస్తూ వీడియో తీశారు. ఆ తర్వాత ఆ వీడియోను డబ్బులకు విక్రయించేందుకు ప్లాన్ వేశారు. పైగా,
విశాఖపట్టణంలో దారుణం జరిగింది. స్నేహితుల బర్త్‌డే పార్టీకెళ్లిన బీటెక్ విద్యార్థినిపై తోటి స్నేహితులు అత్యాచారం చేస్తూ వీడియో తీశారు. ఆ తర్వాత ఆ వీడియోను డబ్బులకు విక్రయించేందుకు ప్లాన్ వేశారు. పైగా, ఈ వీడియోను అడ్డుపెట్టుకుని ఆ విద్యార్థినికి నరకం చూపించారు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
కృష్ణాజిల్లా ఆగిరిపల్లికి చెందిన బాధితురాలు ఆ సమయంలో స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఇదే కాలేజీలో చదువుతున్న విజయవాడకు చెందిన తోటి విద్యార్థి టీ వంశీకృష్ణ, సీనియర్ విద్యార్థి శివారెడ్డిలతో ఆమెకు పరిచయమేర్పడింది. వారిద్దరు ఆగిరిపల్లిలో రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బర్త్‌డే పార్టీ ఉందంటూ ఆమెను 2017 ఫిబ్రవరి నెలలో వారిద్దరు తమ గదికి పిలిచారు. స్నేహితులే కదా అని నమ్మి వెళ్లిన ఆ విద్యార్థినికి మత్తుపదార్థం కలిపిన కూల్‌డ్రింక్‌ను తాపించారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే అత్యాచారం జరిపారు.
ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. విషయాన్ని బయటకు చెబితే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. కానీ, వారిద్దరు మాత్రం ఊరుకోలేదు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తమ ముఖాలు కనిపించకుండా బ్లర్ చేసి.. ఆమె ముఖం ఒక్కటే కనిపించేలా చేసి వీడియోను తమ స్నేహితుల మొబైళ్లకు పంపించారు.
ఆ వీడియోను చూసిన బొద్దనపల్లి గ్రామానికి చెందిన దొడ్ల ప్రవీణ్.. ఆమెకు ఫోన్ చేసి, బెదిరించాడు. రూ.10 లక్షలు ఇస్తే సరే, లేదంటే ఆ వీడియోను బయట పెడతానని బేరం పెట్టాడు. కొద్దికాలం ప్రవీణ్ వేధింపులను బాధితురాలు భరించింది. ఆ తర్వాత మరింత రెచ్చిపోసాగాడు. చివరకు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పేసింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందుతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.