బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (17:21 IST)

లిఫ్ట్ ఇస్తానంటే వద్దన్నదని రేప్ చేశాడు... గోవా ట్యాక్సీ డ్రైవర్ ఘాతుకం

గోవాలో మరో దారుణం జరిగింది. ఓ ట్యాక్సీ డ్రైవర్ ఇస్తానన్న లిఫ్ట్‌ను యువతి తిరస్కరించింది. దీంతో ఆ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజా

గోవాలో మరో దారుణం జరిగింది. ఓ ట్యాక్సీ డ్రైవర్ ఇస్తానన్న లిఫ్ట్‌ను యువతి తిరస్కరించింది. దీంతో ఆ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గోవాలోని వాస్కో ఎయిర్‌పోర్టు రోడ్డు వెంబడి 20 యేళ్ల యువతి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నది. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ ట్యాక్సీడ్రైవర్ రవిచంద్రభట్ (48) ఆ యువతి వద్ద కారు ఆపి లిఫ్టిస్తానని చెప్పాడు. 
 
అయితే, ఆ యువతి మాత్రం అతని లిఫ్ట్‌ను తిరస్కరించింది. ఆ వెంటనే రవిచంద్ర ఆ యువతిని బలవంతంగా టాక్సీలోకి లాగాడు. యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి అక్కడ వదిలివేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బాధితురాలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దీనిపై వాస్కో పోలీస్ ఇన్‌స్పెక్టర్ నొలస్కో రపొసొ స్పందిస్తూ, రవిచంద్ర భట్ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో టాక్సీ నడుపుతూ.. వాస్కోలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. ఈ ఘటన ఎయిర్‌పోర్టుకు 40 కిలోమీటర్ల దూరంలో జరిగింది.