మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (16:29 IST)

మైనర్ బాలికపై అత్యాచారం.. దగ్గరుండి రేప్ చేయించిన మహిళలు

ముగ్గురు మహిళలు ఓ మైనర్ బాలికపై దగ్గరుండిమరీ అత్యాచారం చేయించారు. అలా నాలుగు రోజుల పాటు పలువురితో అత్యాచారం చేయించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్‌లో

ముగ్గురు మహిళలు ఓ మైనర్ బాలికపై దగ్గరుండిమరీ అత్యాచారం చేయించారు. అలా నాలుగు రోజుల పాటు పలువురితో అత్యాచారం చేయించి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్‌లో ఈ అత్యాచార ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
పంజాబ్‌ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన 13 ఏళ్ల బాలిక తన తల్లి స్నేహితురాలు సోనా వద్ద ఉండేందుకు సంగ్రూర్‌కు వచ్చారు. ఇదే అదునుగా భావించిన సోనా... తన స్నేహితురాళ్లైన ఇద్దరు మహిళలతో కలిసి ఆ బాలికను ఉపయోగించుకుని డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు. 
 
ఇందులోభాగంగా, ఆ  బాలికను వివిధ ప్రాంతాలకు తిప్పుతూ పలువురితో అత్యాచారం చేయించారు. అలా నాలుగు రోజుల పాటు బాలికను ఇలాగే చిత్రహింసలకు గురిచేశారు. చివరకు వారి చెర నుంచి తప్పించుకున్న ఆ బాలిక.. ఈనెల 24వ తేదీన లుథియానాలోని తన తల్లికి ఫోన్‌ చేసి చెప్పటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఆ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... బాలికను రక్షించారు. ఈ దారుణంపై బాలిక తల్లి మాట్లాడుతూ.. ఒక యేడాది క్రితం తాము సంగ్రూర్‌లోనే ఉండేవాళ్లం. అప్పుడే నాకు సోనాతో పరిచయం ఏర్పడింది. వేసవి సెలవులు కావడంతో నా కూతురు 15 రోజుల క్రితం సోనా వాళ్ల ఇంటికి వెళ్లింది. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. పైగా నాపై సోనా బెదిరింపులకు దిగడాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్టు, ఈ విషయంలో తన కుమార్తెకు న్యాయం జరిగేంత వరకు సోనాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.