మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (17:08 IST)

అలాంటివారు ఆవాలుతో జాగ్రత్తగా వుండాలి...

వంటిట్లో ఆవాలు లేని ఇళ్ళు తెలుగునాట ఉండదంటే అతిశయోక్తి కాదు. తాళింపు పెట్టాలంతే ఆవాలు ఉండాలి. ఆవాలు సువాసనా ద్రవ్యమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన దివ్యమైన ఔషధం. ముఖ్యంగా ఆవాలు స్త్రీలకు సంబంధి

వంటిట్లో ఆవాలు లేని ఇళ్ళు తెలుగునాట ఉండదంటే అతిశయోక్తి కాదు. తాళింపు పెట్టాలంతే ఆవాలు ఉండాలి. ఆవాలు సువాసనా ద్రవ్యమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన దివ్యమైన ఔషధం. ముఖ్యంగా ఆవాలు స్త్రీలకు సంబంధించిన పలు సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఆవాలలో చాలా రకాలున్నాయి. వాటినే తెల్ల, ఎర్ర, సన్న, పెద్ద ఆవాలని చెబుతుంటారు. 
 
తెల్ల ఆవాలు స్త్రీలకు తరచుగా అయ్యే గర్భస్రావాన్ని అరికడుతాయి. స్త్రీల మర్మాయవాలలో ఉండే క్రిములను చంపే గుణం తెల్ల ఆవాలకున్నది. స్త్రీలలో గర్భస్థ శిశువుకు కూడా ఇవి బాగా ఉపయోగపడుతాయి. గర్భస్థ శిశువుకు హాని కలిగించే సూక్ష్మ క్రిములను ఇవి నాశనం చేయగలవు. వేడి చేసే శరీరతత్వం ఉన్న వ్యక్తులు ఆవాలు వినియోగం కాస్త తక్కువగా చేసుకుంటే మంచిది. మిగిలిన వారు తరచుగా ఆవాలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 
 
ప్రధానంగా కుష్టు వ్యాధితో బాధపడే వారికి ఆవాలు దివ్యఔషధంగా పనిచేస్తాయి. కుష్టు వ్యాధిలో ఉన్నవారు ఆవనూనెను పై పూతగా రాసుకుంటూ ఆవాలను నోటిలో వేసుకుని తింతే కుష్టు వ్యాధి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చును. ఆయాసం, ఉబ్బసం వ్యాధికి ఆవాలు మంచిగా ఉపయోగపడుతాయి.

రేచీకటి వ్యాధిలో కూడా ఆవాలు బాగా పనిచేస్తాయి. ఇతర నేత్రరోగాలలో, చత్వారమున్నప్పుడు ఆవాలు నేత్రాలకు చెరుపు చేస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.