సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (17:29 IST)

ఇరాన్ నుంచి చమురు దిగుమతులొద్దు.. వంద శాతం సుంకాలా?: ట్రంప్

ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపి వేయాలని అమెరికా కోరింది. వచ్చే నవంబర్ నుంచి భారత్‌తో పాటు అన్నీ దేశాలు చమురు దిగుమతులను ఆపేయాలని కోరింది. భారత్‌కు, భారత కంపెనీలకు మినహాయింపు ఏమీ ఉండబోదని అగ్

ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపి వేయాలని అమెరికా కోరింది. వచ్చే నవంబర్ నుంచి భారత్‌తో పాటు అన్నీ దేశాలు చమురు దిగుమతులను ఆపేయాలని కోరింది. భారత్‌కు, భారత కంపెనీలకు మినహాయింపు ఏమీ ఉండబోదని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ట్రంప్ ఆ దేశంపై తిరిగి ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
అమెరికా ఇరాన్‌పై  విధించే ఆర్థిక ఆంక్షలు ఇతర దేశాల మాదిరే చైనా, భారత కంపెనీలకు కూడా అమలవుతాయని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి చెప్పారు. ఇప్పటి నుంచే చమురు దిగుమతులను తగ్గించుకుంటూ నవంబర్ 4 నాటికి పూర్తిగా ఆపేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
 
మరోవైపు అమెరికాలో తయారై భారత్‌కు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 100 శాతం పన్నులను విధించడాన్ని డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. వచ్చే వారంలో భారత్, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ.. వివిధ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. 
 
భారత్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. అమెరికా ఉత్పత్తులపై వంద శాతం పన్ను వసూలు చేస్తున్నారని.. ఈ పన్నులను తొలగించాలని తాము కోరుతున్నామని ట్రంప్ తెలిపారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై ట్రంప్ పన్నుల భారాన్ని పెంచడం మొదలు పెట్టిన తరువాత, పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై సుంకాలను విధిస్తున్న సంగతి తెలిసిందే.