శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (14:36 IST)

క్రికెట్ ఫ్యాన్స్ అత్యధికంగా ఎక్కడున్నారో తెలుసా?

ప్రపంచంలో ఎక్కువ శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడున్నారో తెలుసా? భారత ఉపఖండంలోనే. ఈ విషయం ఐసీసీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్రపంచంలో క్రికెట్‌ను అభిమానించే వారిలో 70 శాతం మంది టెస్టు క్రికెట్ పట్

ప్రపంచంలో ఎక్కువ శాతం మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడున్నారో తెలుసా? భారత ఉపఖండంలోనే. ఈ విషయం ఐసీసీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్రపంచంలో క్రికెట్‌ను అభిమానించే వారిలో 70 శాతం మంది టెస్టు క్రికెట్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. ఇంగ్లండ్, వేల్స్‌లో అత్యధికంగా 86శాతం మంది టెస్టు క్రికెట్ పట్ల ఆసక్తి చూపిస్తుండగా, వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లను ఆఫ్రికాలో 91 శాతం మంది ఇష్టపడుతున్నారు. 
 
ట్వంటీ-20 క్రికెట్ అభిమానించే వారు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో 98 శాతం మంది వున్నారు. ప్రపంచవ్యాప్తంగా టీ 20 మ్యాచులను 92 శాతం మంది లైక్ చేస్తుంటే, వన్డే మ్యాచులను 88 శాతం మంది ఇష్టపడతున్నారు. 16-69 మధ్య వయసు కలిగిన వారి నుంచి ఈ అభిప్రాయాలను పరిశోధనలో తెలుసుకున్నారు.
 
ఇదిలా ఉంటే.. టీమిండియా సుదీర్ఘ పర్యటన బుధవారంతో ప్రారంభం కాబోతోంది. ఐర్లండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ బుధవారం రాత్రి జరుగనుంది. ఇందులో భాగంగా... మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టులు ఆడబోతోంది.