గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (17:02 IST)

అమ్మో.. భారత్‌ మహిళలకు ప్రమాదకరమైన దేశం.. నిర్భయ లాంటి?

దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, భారత్ మహిళలకు ప్రమాదకరమైన దేశమని రాయిటర్స్ ఫౌండేషన్ సర్వేలో తేలింది. భారతదేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ లాంటి పాశవిక దాడి జరిగిన ఐదేళ్ల క

దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, భారత్ మహిళలకు ప్రమాదకరమైన దేశమని రాయిటర్స్ ఫౌండేషన్ సర్వేలో తేలింది. భారతదేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ లాంటి పాశవిక దాడి జరిగిన ఐదేళ్ల కాలంలో మహిళల భద్రతకు ప్రభుత్వం అవసరమైనన్ని చర్యలు తీసుకోలేదని సర్వే తేల్చి చెప్పింది.
 
అత్యాచారం, వైవాహిక అత్యాచారం, లైంగిక దాడి, హింస, ఆడ శిశువుల హత్య ఇప్పటికీ భారత్‌లో పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయని తాజా సర్వేలో వెల్లడి అయ్యింది. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని.. కఠినమైన శిక్షలు అమలు చేయడం కోసం చట్ట సవరణలోనూ ప్రభుత్వం దృష్టి పెట్టలేదని తాజా సర్వేలో తేలింది. అలాగే మహిళలపై లైంగిక హింసకు తోడు వారిని బానిస కార్మికులుగా మార్చే పరిస్థితులు భారత్‌లో వున్నాయని ఆ సర్వే తేల్చింది. ఈ సర్వేలో 550 మంది పాల్గొన్నారు.
 
ఇకపోతే.. ఈ సర్వేలో లైంగిక హింసపరంగా పాశ్చాత్య దేశాల్లో అమెరికా ఒక్కటే టాప్-10లో నిలవగా.. మహిళలకు ప్రమాదకర దేశాలుగా ఆప్ఘనిస్థాన్, సిరియా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. సోమాలియా, సౌదీ అరేబియా తర్వాత స్థానాల్లో ఉన్నాయి.