1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (13:10 IST)

చనిపోయిన ఆత్మీయులు కలలోకి వస్తే....

కలలు అంటేనే అదొక వింత ప్రపంచం. అందులో ఏమైనా జరగవచ్చును. అసలు అర్థంపర్థం లేని కలలు వస్తుంటాయి. చాలావరకు మనం వాటిని పట్టించుకోం. కొన్ని కలలైతే గుర్తుండవు కూడా. కానీ ఒక్కోసారి చనిపోయిన మన ఆత్మీయులు కలలో

కలలు అంటేనే అదొక వింత ప్రపంచం. అందులో ఏమైనా జరగవచ్చును. అసలు అర్థంపర్థం లేని కలలు వస్తుంటాయి. చాలావరకు మనం వాటిని పట్టించుకోం. కొన్ని కలలైతే గుర్తుండవు కూడా. కానీ ఒక్కోసారి చనిపోయిన మన ఆత్మీయులు కలలో కనిపిస్తుంటారు. మామూలు కలలను పట్టించుకోము గాని ఆత్మీయులు కలలో కనిపిస్తే మాత్రం లోపల ఎక్కడో చిన్న బాధ. ఏంటో అన్న భయం. 
 
తాజాగా సైకాలజీకి సంబంధించిన పత్రికలో ఒక ఆర్టికల్ ప్రచురితమైంది. గతించిన మన ఆత్మీయులు మన కలలో వస్తే వారు సాధారణంగా పూర్తి ఆరోగ్యంగా కనబడతారు. గతించక ముందు వారిలో ఉన్న అనారోగ్యాలు వారిలో కనబడవు. అలాగే వారు చనిపోక ముందు ఎలా ఉన్నారో దానికంటే యవ్వనస్తులుగా ఉన్న సమయంలో ఉన్నవారిలా కనిపిస్తారు. ప్రఖ్యాత సైకాలజిస్టులు చెప్పిన ప్రకారమైతే ఆత్మీయులు కలలో కనిపిస్తే విజిటేషన్ డ్రీమ్స్ అంటారు. 
 
ఈ డ్రీమ్స్ ద్వారా మన ఆత్మీయులు ఒక మెసేజ్ చెప్పాలనుకుంటారట. అది కూడా శుభవార్తే చెబుతారట. పైలోకాల్లో ప్రశాంతంగా ఉన్నామన్న సమాచారం కూడా చెబుతుంటారు. ఇలాంటి కలల గురించి భయపడవలసిన అవసరం లేదు. కానీ అప్పుడప్పుడు జరిగే ప్రమాదాల గురించి ముందే హెచ్చరించడానికి కూడా ఆత్మీయులు కలలోకి వస్తుంటారట.