1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
  4. women kitchen and cookery tips

కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.....

నిమ్మకాయల్ని తడిబట్టలో పాలిథిన్ కవర్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఎండు మిరపకాయలు కారం పట్టించే ముందు కొంచెం ఉప్పు కలిపితే పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం ఉంటుంది. కాఫీ పొడిని ఫ్రిజ్‌లో పెడితే స

women
నిమ్మకాయల్ని తడిబట్టలో పాలిథిన్ కవర్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఎండు మిరపకాయలు కారం పట్టించే ముందు కొంచెం ఉప్పు కలిపితే పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం ఉంటుంది. కాఫీ పొడిని ఫ్రిజ్‌లో పెడితే సువాసన పోదు గడ్డ కట్టకుండా తాజాగా ఉంటుంది. కిచెన్‌లో ఉపయోగించే పాత నాప్కిన్‌ని వెనిగర్‌లో ముంచి ఫ్రిజ్‌ని శుభ్రం చేస్తే వాసనతో పాటు పురుగులు కూడా రావు.
 
గోరువెచ్చని నీటిలో కత్తిని ముంచితే డ్రైఫూట్స్‌ను తేలికగా కట్ చేయవచ్చును. కొబ్బరిచిప్ప నుండి కొబ్బరి త్వరగా ఊడి రావాలంటే కొబ్బరి చిప్పను ఫ్రిజ్‌లో ఉంచితే మంచిది. ఫ్రిజ్‌లో కూరగాయలు పెట్టుకునే షెల్ఫ్‌లో అడుగున పేపర్ వేసి ఉంచితే కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. వెన్న కాచేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
బాదం-జీడిపప్పులతో పూరీ ఎలా?