శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (15:02 IST)

గుడికెళ్లిన వికలాంగురాలిని కొంగుపట్టుకుని లాగిన కామాంధుడు

తన కష్టాలు తీర్చాలని వేడుకునేందుకు ఆలయానికి వెళ్లిన వికలాంగురాలిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అదీ కూడా వినాయక చవితి పండుగ సందర్భంగా బలవంతంగా గుడిలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వె

తన కష్టాలు తీర్చాలని వేడుకునేందుకు ఆలయానికి వెళ్లిన వికలాంగురాలిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అదీ కూడా వినాయక చవితి పండుగ  సందర్భంగా బలవంతంగా గుడిలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలానికి చెందిన 18 యేళ్ల యువతి పుట్టుకతోనే వికలాంగురాలు. ఈమె వినాయక చవితి పండుగ సందర్భంగా ఆలయానికి వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై మోహన్ (40) అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో బాధిత కుటుంబీకులు గ్రామ పెద్దలకు విషయాన్ని వివరించగా, పంచాయతీ పెద్దలు విచారించి అత్యాచారం జరిగిన విషయం నిజమేనని తేలడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.