శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 20 సెప్టెంబరు 2018 (13:21 IST)

వినాయకుడు అందంగా వున్నాడని చూసేందుకు వెళ్తే.. ఆ మండపం వెనుక?

వినాయకుడి మండపం వెనుక అత్యాచారం చోటుచేసుకుంది. వినాయకుడు అందంగా వున్నాడని స్నేహితులతో కలిసి నిల్చుంటే.. మాయమాటలు చెప్పి.. వినాయకుడి వెనుక వైపుకు తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. అక్కడే బాలికపై యువకుడు అత్యాచార

వినాయకుడి మండపం వెనుక అత్యాచారం చోటుచేసుకుంది. వినాయకుడు అందంగా వున్నాడని స్నేహితులతో కలిసి నిల్చుంటే.. మాయమాటలు చెప్పి.. వినాయకుడి వెనుక వైపుకు తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. అక్కడే బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అగర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక గణేశ్ నవరాత్రి కావడంతో స్నేహితురాళ్లతో కలిసి గ్రామంలోని వినాయక విగ్రహాలను చూడటానికి వెళ్లింది. ఓ చోట బొజ్జ గణపయ్య బాగా నచ్చడంతో అక్కడే స్నేహితురాళ్లతో కలిసి నిల్చుంది. 
 
ఈ సమయంలో 24 ఏళ్ల మండపాల కాంట్రాక్టర్ ఆమెకు మాయమాటలు చెప్పి గణేశ్ మండపం వెనక్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో  పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.