మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (11:19 IST)

మైనర్ బాలికను ప్రేమ పేరిట మోసం.. రేప్ చేశాడు.. స్నేహితులకు పంచిపెట్టాడు..

మైనర్ బాలికను ఓ యువకుడు ప్రేమ పేరిట మోసం చేశాడు. అంతటితో ఆగకుండా.. తన ప్రేయసిని స్నేహితులకు కూడా పంచిపెట్టాడు. ఈ ఘటన గుంటూరు స్వర్ణభారతీనగర్‌‌కు చెందిన బాలిక నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుక

మైనర్ బాలికను ఓ యువకుడు ప్రేమ పేరిట మోసం చేశాడు. అంతటితో ఆగకుండా.. తన ప్రేయసిని స్నేహితులకు కూడా పంచిపెట్టాడు. ఈ ఘటన గుంటూరు స్వర్ణభారతీనగర్‌‌కు చెందిన బాలిక నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బాధితురాలు 10వ తరగతి చదువుతోంది. ఆ బాలిక ఇంటికి సమీపంలో ఉండే త్రినాథ్ అనే యువకుడు ఇంటర్ చదువుకుని కూలి పనులు చేస్తున్నాడు. ఇతడు బాలిక వెంటపడి.. ప్రేమిస్తున్నానని.. చాక్లెట్లు, ఖరీదైన బహుమతులు ఇచ్చి బుట్టలో వేసుకున్నాడు.
 
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తమ ఇద్దరి విషయాన్ని స్నేహితుడు మోహన్ కృష్ణకు తెలిపాడు. ఒకరోజు వీరిద్దరూ కలిసి బాలికను స్వర్ణభారతీనగర్‌లోని ఓ ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత మరోకరు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతేగాకుండా ఈ ఘటనను వీడియో తీశారు. 
 
ఈ విషయాన్ని బయటికి చెప్తే ఆ వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించాడు. దీంతో బాలిక మిన్నకుండిపోయింది. అలా కొద్దినెలల పాటు త్రినాథ్‌తో పాటు అతని స్నేహితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలా ఏడాదికాలంగా స్నేహితులందరూ ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు.
 
చివరకు వీరి వేధింపులు భరించలేక బాలిక విషయాన్ని ఇంట్లో చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అర్బన్ ఎస్పీ నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దర్యాప్తును ముమ్మరం చేశారు.