శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (16:12 IST)

అక్రమ సంబంధం.. చనిపోయినట్లు డ్రామా... ప్రియుడితో జంప్.. అలా పట్టేశారు...

అక్రమ సంబంధాల గోల పెచ్చరిల్లిపోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చనిపోయినట్లు డ్రామా చేసిన ఓ మహిళ మాజీ ప్రేమికుడితో జంప్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. యూపీలో రాహుల్ అనే యువకునికి రూబీ అనే యువతితో గత 2016

అక్రమ సంబంధాల గోల పెచ్చరిల్లిపోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చనిపోయినట్లు డ్రామా చేసిన ఓ మహిళ మాజీ ప్రేమికుడితో జంప్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. యూపీలో రాహుల్ అనే యువకునికి రూబీ అనే యువతితో గత 2016లో వివాహం జరిగింది. 
 
ఇటీవల ఉన్నట్టుండి ఓ రోజు రూబీ తండ్రి తన కుమార్తెను భర్త హింసించి చంపేశాడని.. రాహుల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో పోలీసులు నిజాలు తెలియరావడంతో విస్తుపోయారు. 
 
రూబీ మృతదేహాన్ని వెతకడంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆమె మృతదేహం ఎక్కడ వెతికినా కనిపించలేదు. అయితే రూబీ ఫేస్‌బుక్ అకౌంట్ మాత్రం యాక్టివ్‌లో వున్నది. దీంతో పోలీసులు అనుమానంతో రూబీ ఫేస్‌బుక్‌ ఆధారంగా ఆమె మొబైల్ ఫోన్ నెంబర్‌ను కనుగొన్నారు.

ఆపై జరిపిన విచారణలో రూబీ మరణించలేదని తెలియవచ్చింది. ఇంకా వేరొక వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలియవచ్చింది. దీంతో రూబీ, ఆమె ప్రేమికుడు, ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.