సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (12:54 IST)

మాయగాడి వలలో మంత్రుల అమ్మాయిలా? 500 మందిని అలా చేశాడా?

మాయ మాటలతో ముంచేశాడు.. ఎందరో అమ్మాయిలను మోసం చేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 500 మంది అమ్మాయిలను బుట్టలో వేసుకుని బాగా సంపాదించాడు. అతడి వలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్య

మాయ మాటలతో ముంచేశాడు.. ఎందరో అమ్మాయిలను మోసం చేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 500 మంది అమ్మాయిలను బుట్టలో వేసుకుని బాగా సంపాదించాడు. అతడి వలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల కుమార్తెలు, మేనకోడళ్లు, మహిళా డాక్టర్లు బాధితులుగా మిగిలిపోయాడు. ఆ కేటుగాడిని, మాయగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
2017లో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు చెందిన ఓ వైద్య విద్యార్థినిని మాయ మాటలతో బుట్టలో వేసుకుని.. ఆమె వద్ద నుంచి 70 వేల నగదు, ఐదు కాసుల బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు. బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కంబాల చెరువు సమీపంలో ఉండే జోగాడ వంశీకృష్ణ  సంపన్న కుటుంబంలో పుట్టాడు. అయితే పలు కారణాల వల్ల ఆస్తులన్నీ తరిగిపోయాయి.
 
2009లో కాకినాడ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి మధ్యలోనే ఆపేశాడు. 2014లో హైదరాబాద్‌ వెళ్లి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించేందుకు గాను ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఫేక్ అకౌంట్లు తెరిచాడు. ఫేస్‌బుక్‌లో యానాం ప్రాంతానికి చెందిన ఓ అందమైన యువకుడి ఫోటోను ఉంచి.. ప్రముఖులు, ధనవంతుల పిల్లలను టార్గెట్ చేసి.. మధురమైన మాటలతో మాయ చేసేవాడు. ఇతని మాయమాటలకు ఎందరో అమ్మాయిలు మోసపోయారు. నగదు, నగలు అప్పగించేవారు. 
 
ఇలా రెండున్నరేళ్ల కాలంలో సుమారు రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. తాజాగా ఓ వైద్య విద్యార్థిని ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జైలుకి వెళ్లొచ్చినా ఇతనిలో మార్పు రాలేదు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ వెతికి చివరికి కాకినాడ రైల్వే స్టేషన్ సమీపంలో వంశీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.