శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (13:01 IST)

ద్రాక్ష రసంలో పెరుగు కలుపుకుని జుట్టుకు రాసుకుంటే?

కీరదోస మిశ్రమంలో కొద్దిగా ఉప్పు, మిరియాల నూనెను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. శెనగపిండిలో కొద్దిగా బ

కీరదోస మిశ్రమంలో కొద్దిగా ఉప్పు, మిరియాల నూనెను కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. శెనగపిండిలో కొద్దిగా బాదం నూనెను కలుపుకుని తలకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే జుట్టు రావడం వంటి సమస్యలు తొలగిపోతాయి.
 
ద్రాక్ష రసంలో కొద్దిగా పెరుగు, చక్కెర కలుపుకుని వెంట్రుకలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. తద్వారా చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. నిమ్మరసంలో కొద్దిగా పసుపు, తేనె కలుపుకుని తలకు రాసుకోవాలి. పావుగంట తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి.
 
శెనగపిండిలో కొద్దిగా పాలు, పసుపు కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కూడా జుట్టు రాలదు. టమోటా గుజ్జులో రోజ్ వాటర్, బెల్లం కలుపుకుని తలకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.