బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 1 సెప్టెంబరు 2018 (11:36 IST)

పెరుగులో అవి కలిపి తీసుకుంటే... అధిక బరువు తగ్గుతుందా...

పెరుగులో తేనెను కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే అల్సర్ వ్యాధులు దరిచేరవు. ఈ మిశ్రంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన శరీరంలో గల ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగించుటకు పెరుగు మంచిగా ఉపయోగపడుతుంది. జీల

పెరుగులో తేనెను కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే అల్సర్ వ్యాధులు దరిచేరవు. ఈ మిశ్రంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన శరీరంలో గల ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగించుటకు పెరుగు మంచిగా ఉపయోగపడుతుంది. జీలకర్ర పొడిని పెరుగులో కలుపుకుని తీసుకుంటే అధిక బరువు తగ్గుతారు. జీర్ణ సంబంధ సమస్యలకు పెరుగులో ఉప్పును కలుపుకుని తీసుకుంటే మంచిది.
 
పెరుగులో కొద్దిగా చక్కెర కలుపుకుని తీసుకోవడం మూత్రాశయ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. పెరుగులో పసుపు, అల్లం మిశ్రమాన్ని కలిపి తీసుకుంటే శరీరంలోనికి ఫోలిన్ యాసిడ్ చేరుతుంది. ఈ పదార్థం గర్భిణులకు, పిల్లలకు ఎంతో సహాయపడుతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పెరుగులో కొద్దిగా వాము వేసుకుని సేవిస్తే నోటి పూత, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి. 
 
ఒక కప్పు పెరుగులో కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు చక్కగా పనిచేస్తుంది. ఎముకల బలానికి పెరుగులో ఓట్స్ వేసుకుని తీసుకుంటే శరీరానికి కావలసిన ప్రోటీన్స్ అందుతాయి. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలుపుకుని తీసుకుంటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. తద్వారా కీళ్ల నొప్పులు, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.