నీలో స్పందనల్లేవ్.. అందుకే అక్కడికి వెళ్తున్నా ... ఏం చేయను?
కొత్తగా వివాహమైంది. 10 - 15 రోజుల పాటు పడకగదిలో శోభనం అనే మాటకు తావుఇవ్వలేదు. ఆయన ఎంతగా ప్రయత్నించినప్పటికీ... నాకెందుకో కోర్కె కలగడం లేదు. ఇలా నెలా రెండు నెలల గడిచిపోయాయి.
కొత్తగా వివాహమైంది. 10 - 15 రోజుల పాటు పడకగదిలో శోభనం అనే మాటకు తావుఇవ్వలేదు. ఆయన ఎంతగా ప్రయత్నించినప్పటికీ... నాకెందుకో కోర్కె కలగడం లేదు. ఇలా నెలా రెండు నెలల గడిచిపోయాయి. ఇపుడు ఆయన నా జోలికి రావడం లేదు. బయట వేశ్యల వద్దకు వెళ్లి వస్తున్నట్టు తెలిసింది. దీనిపై నిలదీస్తే అవును వెళ్లాను. ఎందుకెళ్లాను? నీ కారణంగానే వెళ్లాను. కలసి కాపురం చేయడానికి నువ్వో మనిషివైతేగా! నీకు స్పందనల్లేవు. కోరికలు అంతకంటే లేవు. భర్తను సంతోషపెట్టాలన్న ఆలోచన అసలే లేదు. విడాకులివ్వడానికి మనసు ఒప్పకే, నా పద్ధతిలో నేను శారీరక అవసరాలు తీర్చుకుంటున్నాను. ఇంతకంటే వివరంగా చెప్పాలా అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
ఈ సమస్యపై మానసిక నిపుణులను సంప్రదిస్తే, సాధారణంగా తీవ్ర అనారోగ్యాలు, హార్మోన్ల అసమతౌల్యం, ఔషధాల ప్రభావం, మాదకద్రవ్యాల బానిసత్వం, శీఘ్రస్ఖలనం తదితర కారణాల వల్ల జీవిత భాగస్వామి పట్ల లైంగిక కోల్పోయే ఆస్కారం ఉంది. కానీ, ఇక్కడ మాత్రం... ఇద్దరి మధ్య శృంగార సంబంధ బాధవ్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. సమాజంలో అనేక కాపురాలు కూలడానికి ఇదో ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
ఒకరి లైంగిక అవసరాల మీద మరొకరికి బొత్తిగా అవగాహన లేకుండా పోవడం. అతడికేం కావాలో ఆమెకు తెలియదు. తనకుతానుగా అడగదు. ఆమె ఏం కోరుకుంటోందో అతడికి తెలియదు. చొరవగా తెలుసుకోడు. ఫలితంగా ఒకరిపట్ల ఒకరిలో లైంగిక అసంతృప్తి మొదలవుతుంది. ఆ ఎడమొహం, పెడమొహం... పడకగది నుంచి గుండెగదికి విస్తరిస్తుంది. ఆలూమగల బంధానికి.. విశ్వాసం, గౌరవం, ప్రేమ, సాన్నిహిత్యం... ఈ నాలుగూ నాలుగు స్తంభాలు అయితే, శంగార సమాచారం పునాదిగా భావించాలని సూచన చేస్తున్నారు.
ముఖ్యంగా శృంగారం (శారీరక సంబంధం) కూడా సంభాషణ లాంటిదే. మనం పలకరిస్తే, ఎదుటివారూ పలకరిస్తారు. మనం మనసు విప్పితే, ఎదుటివారూ విప్పే ప్రయత్నం చేస్తారు. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరూ అంతే దూరమనే విషయాన్ని గ్రహించాలి. భర్త ముడుచుకుపోతే, భార్య మరింత ముడుచుకుపోతుంది. అతను మదగజంలా రెచ్చిపోతే, ఆమె ఆడపులిలా ఊగిపోతుంది. కానీ, ఇక్కడ భర్త అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటే.. భార్యలోనే స్పందనలు లేవు. అందువల్ల భర్త ఇష్టాయిష్టాలను తెలుసుకుని నడుచుకంటే దాంపత్య జీవితం సుఖమయంగా సాగిపోతుందని నిపుణులు సూచన చేస్తున్నారు.