సంబంధిత వార్తలు
- టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం... బోండా ఉమ, అనితకు స్థానం...
- టిటిడి ఛైర్మన్ పదవి.. పుట్టా సుధాకర్‌కు పోయినట్లే.. ఎలాగో చూడండి...
- సీఎం చంద్రబాబుకి రుణపడి ఉంటాను : తితిదే ఛైర్మన్ పుత్తా సుధాకర్
- తితిదే ఛైర్మన్‌గా సుధాకర్ యాదవ్.. ఆర్టీసీ ఛైర్మన్‌గా వర్ల
- శ్రీవారి ఆలయంలో ఇక పరకామణి సేవలుండవా? హుండీ కానుకల లెక్కింపు ప్రైవేట్ చేతికి?
అపచారం... తితిదే బోర్డులో క్రిస్టియన్‌కు సభ్యత్వమా?
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుల్లో క్రిస్టియన్‌కు సభ్యత్వం కల్పించారు. దీనిపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కొత్త మండలిలో ఛైర్మన్, ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులతో పాటు 14 మ
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుల్లో క్రిస్టియన్‌కు సభ్యత్వం కల్పించారు. దీనిపై స్వామి పరిపూర్ణానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కొత్త మండలిలో ఛైర్మన్, ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులతో పాటు 14 మంది సభ్యులు ఉన్నారు. అయితే టీటీడీ బోర్డులో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిత సభ్యత్వాన్ని కల్పించడం ఇపుడు వివాదాస్పదమైంది. దీనిపై స్వామి పరిపూర్ణానంద అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఏంఎల్ఏ అనిత స్వయంగా తాను క్రిస్టియన్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్న విషయాన్ని స్వామి పరిపూర్ణానంద తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'తితిదే నూతన పాలక మండలిలో ఓ క్రిస్టియన్‌కి అవకాశం ఇవ్వడం ఏమిటి?.. ఇది ఏమి గ్రహచర్యం.. ఇది ఏమి న్యాయం?.. హిందువుల మౌనం చేతకానితనంగా భావిస్తున్నారా?.. ప్రశ్నించే సమయం ఆసన్నం అయింది' అంటూ ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
ఇది వివాదాస్పదం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎమ్మెల్యే అనితకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే, గతంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాల ఫుటేజీని కూడా అందజేయాలని ఆయన కోరారు.
