ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (14:52 IST)

బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే ఇక మరణదండనే : ఆర్డినెన్స్‌కు ఆమోదం

బాలికలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు ఇకపై మరణశిక్షలను అమలు చేయనున్నారు. ఈ మేరకు కేంద్రం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఈ ఆర్డినెన్స్‌లోని నిబంధన మేరకు 12 సంవత్సరాల వయసులోపు బాలలపై అత్యాచారాలకు పాల్

బాలికలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు ఇకపై మరణశిక్షలను అమలు చేయనున్నారు. ఈ మేరకు కేంద్రం ఓ ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఈ ఆర్డినెన్స్‌లోని నిబంధన మేరకు 12 సంవత్సరాల వయసులోపు బాలలపై అత్యాచారాలకు పాల్పడే నేరస్థులకు మరణ శిక్ష విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు లైంగిక నేరాల నుంచి బాలలపరిరక్షణ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
శనివారం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, స్మృతి ఇరానీ, ఉమా భారతి, పీయూష్ గోయల్, హర్షవర్థన్, రవిశంకర్ ప్రసాద్, జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. 
 
ఈసమావేశంలో పోక్సో చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 0-12 ఏళ్ల వయసు చిన్నారులపై అత్యాచారం జరిపేవారికి మరణ దండన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపుతారు. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత ఆర్డినెన్స్ జారీఅవుతుంది.